తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' ప్రభుత్వంపై నేడు సుప్రీం అత్యవసర విచారణ

మహారాష్ట్రలో ఫడణవీస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శివసేన-కాంగ్రెస్​-ఎన్​సీపీ దాఖలు చేసిన పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు 3 పార్టీల వ్యాజ్యాన్ని విచారించనుంది.

'మహా' ప్రభుత్వంపై నేడు సుప్రీం అత్యవసర విచారణ

By

Published : Nov 24, 2019, 5:04 AM IST

Updated : Nov 24, 2019, 8:02 AM IST

'మహా' ప్రభుత్వంపై నేడు సుప్రీం అత్యవసర విచారణ

మహా మలుపుతో మరింత ఉత్కంఠగా మారిన మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టు వద్దకు చేరాయి. ముఖ్యమంత్రి ఫడణవీస్​ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన దాఖలు చేసిన పిటిషన్​పై నేడు అత్యున్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టనుంది. జస్టిస్​ రమణ, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కేసును విచారించనుంది.

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన సిద్ధమవుతున్న వేళ.. శనివారం ఉదయంమహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడణవీస్​..ఉపముఖ్యమంత్రిగా ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలనను అందిస్తామని ఫడణవీస్​ ధీమా వ్యక్తం చేశారు.

అయితే మెజారిటీ లేని ఫడణవీస్​ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాయి మూడు పార్టీలు. కూటమి నేత ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించేలా గవర్నర్​కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో పేర్కొన్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాస పరీక్ష జరిగేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించాయి.

ముంబయి హోటళ్లల్లో రాజకీయాలు...

ఫడణవీస్​ చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.. బల పరీక్షకు ఈ నెల 30 వరకు గడువునిచ్చారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను ముంబయి హొటల్​కు తరలించింది ఎన్​సీపీ పార్టీ. బలపరీక్ష జరిగే వరకు ఎమ్మెల్యేలు అక్కడే ఉండనున్నారని సమాచారం.

ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు సహకరించి సంచలనం సృష్టించిన అజిత్​ పవార్​... శనివారం రాత్రి తన సోదరుడు శ్రీనివాస్​ పవార్​తో భేటీ అయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చలపై స్పష్టత లేదు.

మరోవైపు.. అజిత్​ పవార్​ను పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది ఎన్​సీపీ.ఆ బాధ్యతలను సీనియర్​ నేత జయంత్​ పాటిల్​కు అప్పగించింది.

ఇదీ చూడండి:-

మహా చదరంగం: మోదీ-షా X శరద్​ పవార్​

మహా పీఠం తెర వెనుక 'ఆయన'దే కీలక పాత్ర?

'ఫడణవీస్​ ప్రభుత్వాన్ని స్పీకర్​ ఎన్నికలోనే ఓడిస్తాం'

Last Updated : Nov 24, 2019, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details