తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2019, 5:40 AM IST

ETV Bharat / bharat

శివసేన పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మరింత గడువు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో శివసేన మంగళవారం పిటిషన్​ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారించాల్సిన వ్యాజ్యంగా సేన పేర్కొనగా.. అందుకు తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం నేడు రిట్​ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. సేన వ్యాజ్యం దాఖలు చేస్తే సర్వోన్నత న్యాయపాలిక  నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

సేన పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ!

మహారాష్ట్ర గవర్నర్ భగత్​సింగ్ కోశ్యారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది శివసేన. అయితే అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీం నేడు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. సేన పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీం నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

"ఉదయం 10.30 గంటలకు రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది."

-సునీల్ ఫెర్నాండెజ్, శివసేన తరఫు న్యాయవాది.

రాష్ట్రపతి పాలనపైనా

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాల్​ చేస్తూ రెండో పిటిషన్ దాఖలు చేయనున్నామని న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తెలిపారు. దీనిపై నేడు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

గవర్నర్ లక్ష్యంగా...

సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం కల్పించకూడదని సోమవారం గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని అత్యవసర పిటిషన్​లో పేర్కొంది సేన. తమను సోమవారం లోగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారని.. మరింత సమయం కోరగా గవర్నర్ అందుకు ఆమోదం తెలపలేదని పిటిషన్​లో తెలిపింది.

గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదని, పక్షపాతంతో కూడిన, అసమంజసమైన, అనుచితమైందని పిటిషన్​లో పేర్కొంది సేన. గవర్నర్ కేంద్రంలో అతిపెద్ద పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయడం సరికాదని పిటిషనర్ తన వ్యాజ్యంలో అభిప్రాయపడ్డారు. గవర్నర్​ నిర్ణయాలు రాజ్యాంగంలోని 14, 21 అధికరణలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని వెల్లడించారు.

చివరికి ఇలా జరిగింది..

ప్రభుత్వ ఏర్పాటుకు మూడు రోజులు సమయం కావాలని శివసేన గవర్నర్​ భగత్ కోశ్యారీని అభ్యర్థించింది. అయితే అందుకు నిరాకరించిన గవర్నర్ సోమవారం రాత్రి ఎన్​సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతికి లేఖ పంపించారు. ఫలితంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రామ్​నాథ్​ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'మహా' రాజకీయం: రాష్ట్రపతి పాలన షురూ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details