తెలంగాణ

telangana

ETV Bharat / bharat

22న శివసేన 'మహా' భేటీ.. కీలక నిర్ణయం!

ఈ నెల 22న శివసేన కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు పాల్గొననున్నారు. మహా ప్రతిష్టంభన నేపథ్యంలో పార్టీ భవిష్యత్​ కార్యచరణపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే కీలక ప్రకటన చేసే అవకాశముంది.

22న శివసేన 'మహా' భేటీ.. కీలక నిర్ణయం!

By

Published : Nov 20, 2019, 7:16 AM IST

సమావేశాలు, సంప్రదింపులు, చర్చలతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. మహా ప్రతిష్టంభన, రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న తరుణంలో ఈ నెల 22న ముంబయిలో తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించనుంది శివసేన. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్​సీపీ-కాంగ్రెస్​ ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో శివసేన భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. భవిష్యత్​ కార్యచరణపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.

"ఈ నెల 22న పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు సమావేశంకానున్నారు. ఇందులో ఉద్ధవ్​ ఠాక్రే ప్రసంగించనున్నారు. భవిష్యత్​ కార్యచరణతో పాటు నూతన ఎమ్మెల్యేలతో మాట్లాడతారు."
--- శివసేన నేత.

అక్టోబర్​లో జరిగిన ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమికి మెజారిటీ లభించింది. ముఖ్యమంత్రి పీఠంపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల కమల దళంతో సేన తెగదెంపులు చేసుకుంది. అనంతరం.. ఎన్​సీపీ-కాంగ్రెస్​ కూటమితో చేతులు కలిపింది. ఎన్నికల ఫలితాలు విడుదలై 27 రోజులు గడిచినా... ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనలో ఉండిపోయింది.

ఇదీ చూడండి:- టికెట్టు తీసుకోలేదని బస్సు నుంచి తోసేశాడు!

ABOUT THE AUTHOR

...view details