కరోనా లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. స్థిరాస్తి రంగ సమాఖ్య నారెడ్కో ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్యాకేజీపై నిర్ణయం.. ప్రధాని స్థాయిలో తీసుకుంటారని స్పష్టం చేశారు.
" ప్యాకేజీ ఇవ్వడం ద్వారా అన్నిరంగాలకు వీలైనంత సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్యాకేజీకి సంబంధించి మేము సూచనలు మాత్రమే ఇవ్వగలం. తుది నిర్ణయం మాత్రం ప్రధానిదే. వ్యవవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ప్రత్యేక సాయం చేసే యోచనలో కేంద్రం ఉంది. అగ్రో ఎంఎస్ఎంఈ, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో అనేక అవకాశాలున్నాయి."
- నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి