చెన్నై విమానాశ్రయంలో దాదాపు రూ.2.45 కోట్లు విలువచేసే 24.5 కిలోల మాదక ద్రవ్యాల్ని.. ఎయిర్పోర్ట్ కార్గో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను.. ఓ కార్గో విమానంలో స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని అన్నారు.
రూ.2 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత - చెన్నై
చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు స్మగ్లింగ్ చేయబోయిన రూ.2 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తోన్న 43 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
రూ.2 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
తనిఖీలు చేయగా కొబ్బరికాయలలో డ్రగ్స్ దొరికినట్లు వెల్లడించారు. వాటిని సీజ్ చేశామన్నారు. డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న 43 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:జాతీయ జెండా కప్పినందుకు ఎఫ్ఐఆర్