బెదిరింపు ఫోన్ కాల్‌తో 'తాజ్' వద్ద భద్రత కట్టుదిట్టం
09:29 June 30
బెదిరింపు ఫోన్ కాల్‌తో తాజ్ వద్ద భద్రత కట్టుదిట్టం
ముంబయిలోని తాజ్‌హోటల్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి సోమవారం బెదిరింపు కాల్ రావడమే కారణమని తెలుస్తోంది. హోటల్‌ను బాంబులతో పేల్చేస్తామని అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు.
2008లో ఉగ్రవాదులు ఇదే హోటల్‌ను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించారు. 26/11 ఉగ్రదాడిగా పిలిచే ఈ ఘటనలో పలువురు విదేశీయులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.