జమ్ముకశ్మీర్‌లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుల్గాం జిల్లాలో బంగాల్‌కు చెందిన కూలీలే లక్ష్యంగా ఉగ్రదాడులు దాడి చేసి.. ఆరుగురిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో కశ్మీర్ లోయలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఉగ్రమూకల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. ఆంక్షల నేపథ్యంలో సాధారణ జనజీవనం స్తంభించింది.
రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసి 87 రోజులైనప్పటికీ.. జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. వ్యాపార సముదాయాలు, దుకాణాలు బుధవారం మూసి ఉన్నాయి. ప్రజారవాణా స్తంభించింది. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికేతరులే లక్ష్యంగా దేశ విద్రోహ శక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా భద్రత దళాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. దక్షిణ కశ్మీర్‌తో పాటు శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లో బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.
ఈయూ బృందం పర్యటన సందర్భంగా..