జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి.
సోపోర్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. ధీటుగా స్పందించిన భద్రతాదళాలు ఓ ముష్కరుడిని హతమార్చాయి.