మాదక ద్రవ్యాలు, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా కోసం కేటుగాళ్లు కొత్త దారులు తొక్కుతున్నారు. తాజాగా దిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మరాద్ అలం అనే వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో అక్రమంగా విదేశీ కరెన్సీతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా... భద్రతా సిబ్బంది అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘనుడు వాటిని తీసుకెళ్లేందుకు వేసిన ఎత్తుగడ చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే.
శెనక్కాయల్లో విదేశీ కరెన్సీ తరలింపునకు యత్నం - telugu national news udpates
దిల్లీలో ఓ వ్యక్తి అక్రమంగా విదేశీ కరెన్సీని దుబాయ్ తీసుకెళ్లేందుకు యత్నించగా.. భద్రతా సిబ్బంది అతన్ని అరెస్టు చేసింది. ఆ ఘనుడు డబ్బును తీసుకెళ్లిన విధానం చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు.
శెనక్కాయల్లో విదేశీ కరెన్సీ తరలింపునకు యత్నం
వేరు శెనక్కాయలు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలలో పెట్టి అమెరికా, దుబాయ్ కరెన్సీని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు మరాద్. అనుమానం వచ్చి తనిఖీ చేసిన అధికారులు... వీటిని చూసి కంగుతిన్నారు. అనంతరం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Last Updated : Mar 1, 2020, 2:13 AM IST