తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్ర స్థావరాలను ఛేదించిన భద్రతా దళాలు - militant latest news

జమ్ము కశ్మీర్‌ షోపియాన్​ జిల్లాలో ఆర్మీ, పోలీసుల సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఛేదించిన భద్రతాదళాలు.. భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Security forces bust militant hideout in J-K's Shopian district
ఉగ్రవాదుల రహస్య స్థావరాలను ఛేదించిన భద్రతదళాలు

By

Published : Jul 26, 2020, 10:49 PM IST

జమ్ము కశ్మీర్​లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రమూకలు ఉన్నాయనే పక్క సమాచారంతో సైనిక బలగాలు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల రహస్య స్థావరాలు ఛేదించి... భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్​లో భాగంగా దాచూ జైన్‌పొరాలోని ఓ తోటలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని కనిపెట్టి... 4 బారెల్ గ్రనేడ్ లాంచర్లు, 3 చైనీస్​ గ్రనేడ్లు, ఏకే 47 మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 9,431 కేసులు

ABOUT THE AUTHOR

...view details