అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ముందునుంచే అనుమానిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఇప్పటికే నిఘా పెంచారు. దిల్లీ రిడ్జ్ రోడ్డులోని బుద్ధ జయంతి పార్క్ సమీపంలో ఐసిస్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని శనివారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. అప్రమత్తమయ్యారు అధికారులు. అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడిక్కడ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్‌తో అయోధ్యలో హైఅలర్ట్ - suspected terrorist caught in Delhi
దేశ రాజధాని దిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్‌తో అప్రమత్తమయ్యారు అధికారులు. అయోధ్య రామాలయ నిర్మాణం నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో.. హై అలర్ట్ ప్రకటించారు. భారీగా బలగాలను మోహరించి.. తనిఖీలు చేపట్టారు.
ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్‌తో అయోధ్యలో హైఅలర్ట్
దిల్లీలో ఉగ్రమూకల కదలికల నేపథ్యంలో ప్రధాన నగరాల్లో భద్రత పెంచారు. క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అయోధ్యలోకి అనుమతిస్తున్నారు. అదే సమయంలో.. రామ జన్మభూమి ప్రాంతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల్లో భారీగా భద్రత దళాలను మోహరిస్తున్నారు.
ఇదీ చూడండి: ఐసిస్ ఉగ్రవాది అరెస్టు.. పేలుడు పదార్థాలు స్వాధీనం