కరోనా విజృంభణ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నితీశ్ ప్రభుత్వం బిహార్ ప్రజల సంక్షేమం కోసం పనిచేసిందని కొనియాడారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయన చేతిలోనే కొనసాగేలా చూడాలని అక్కడి ప్రజలను కోరారు.
గయాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు నడ్డా. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేశారు.
" ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం క్షేమంగా ఉంది. అలాగే బిహార్ క్షేమంగా ఉంది నితీశ్ నేతృత్వంలోనే".