తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2020, 5:45 AM IST

ETV Bharat / bharat

అయోధ్యలో డిసెంబర్​ 17 వరకు 144 సెక్షన్​

అయోధ్యలో 144 సెక్షన్​ను విధించారు అధికారులు. రానున్న పండుగల సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొనకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసకున్నారు. డిసెంబర్​ 17 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.

Section 144 imposed in Ayodhya till December 17
అయోధ్యలో డిసెంబర్​ 17 వరకు 144 సెక్షన్​

ఉత్తర్​ ప్రదేశ్​లోని అయోధ్య జిల్లాలో సెక్షన్​ 144 సెక్షన్​ను విధించారు అధికారులు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. రానున్న పండుగల దృష్ట్యా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయోధ్యలో నిర్వహించే దీపోత్సవ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పాల్గొంటారని జిల్లా మేజిస్ట్రేట్​ అనూజ్​ కుమార్ చెప్పారు. పండుగల మధ్యలోనే కొన్ని కీలక పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వెల్లడించారు. ఆ సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ నిబంధనలను విధించామని అన్నారు.

"అయోధ్యలో నవంబర్​ 13న వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. రమాకాంత్​ పార్క్​లో రాముని పట్టాభిషేక వేడుకలు నిర్వహిస్తారు. అదే రోజు.. హెలికాప్టర్​ నుంచి పూలవర్షం కురిపిస్తారు. సాయంత్రం సరయు హారతి కార్యక్రమం ఉంటుంది. రామ్​లీలతో పాటు దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా.. ఉండేందుకే జిల్లా యంత్రాంగం ఈ నిబంధనలను విధించింది. "

-- అనూజ్​ కుమార్​, అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్​.

డిసెంబర్​ 17 వరకు అయోధ్య జిల్లా వ్యాప్తంగా ఈ 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఎన్నికల ప్రచారంలో కాల్పులు- అభ్యర్థి మృతి

ABOUT THE AUTHOR

...view details