భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా వీవీఐపీల కోసం ఉపయోగించే.. ఖరీదైన, ప్రత్యేక బోయింగ్ 777 రెండో విమానం భారత్ చేరింది. ఎయిర్ ఇండియా వన్‌గా పిలిచే ఈ రెండో విమానం అమెరికా నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం దిల్లీలో ల్యాండ్ అయింది.
ఈనెల ఒకటిన తొలి ఎయిరిండియా వన్ విమానం.. భారత్‌కు చేరింది. ఇందులో అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. గగనతలంలో ఎలాంటి ఆటంకాలు, హ్యాకింగ్ బెడద లేకుండా ఆడియో, వీడియా సమాచార వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. జంబో విమానం బోయింగ్ బి-747ను బి-777గా మార్చి ఎయిరిండియా వన్ విమానాన్ని తయారుచేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను వాయుసేనకు అప్పగించారు.