జమ్ముకశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.
కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటర్లను భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.
జమ్ముకశ్మీర్‌లో మొత్తం 48.62 శాతం పోలింగ్ నమోదైంది.
ఇదీ చూడండి: కశ్మీర్ లెక్కలు మార్చిన డీడీసీ ఎన్నికలు!
బోగస్ ఓట్లు..
డీడీసీ ఎన్నికల ఓటింగ్‌లో అవకతవకలు బయటపడ్డాయి. బందీపొరాలోని గన్స్టన్ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్లారు. బోగస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:ఫరూక్ అబ్దుల్లా 'రోష్ని' భూములపై రాజకీయ రగడ