తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపటి నుంచి పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాలు - రేపటి నుంచి పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాలు

పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో.. నరేంద్రమోదీ సర్కారుపై ఎదురుదాడి చేయాలని కాంగ్రెస్ సహా ఇతర పార్టీల​ నేతలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వాతావరణం మరోమారు వేడెక్కే అవకాశముంది.

Second half of Budget Session begins Monday
రేపటి నుంచి పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాలు

By

Published : Mar 1, 2020, 10:55 AM IST

Updated : Mar 3, 2020, 1:12 AM IST

రేపటి నుంచి పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సరోగసీతో పాటు పలు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దేశరాజధానిలో హింసకు కారణమైన సీఏఏపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలో 43 మంది మృతిచెందారు. ఈ అల్లర్లను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్​ ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో... బడ్జెట్​ సమావేశాలు ఎలా సాగుతాయనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

అప్పుడూ అంతే..

జనవరి 31న ప్రారంభమైన తొలి విడత బడ్జెట్​ సమావేశాలు సైతం.. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలతో దేశం అట్టుడుకుతున్న తరుణంలోనే జరిగాయి.

ఏప్రిల్​ 3న ముగింపు

ఈ బడ్జెట్​ సమావేశాల్లో సుమారు 45 బిల్లులు, 7 ఆర్థిక పద్దులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. బ్యాంకులు దివాలా తీయడం, ఖనిజ సవరణ చట్టాలు-2019 ఆర్డినెన్స్​లను కూడా ఉభయసభల ముందుకు తీసుకురానుందని సమాచారం. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు ఏప్రిల్​ 3న ముగియనున్నాయి.

ఇదీ చదవండి:దీదీ అడ్డాలో నేడు అమిత్​ షా 'సీఏఏ' ర్యాలీ

Last Updated : Mar 3, 2020, 1:12 AM IST

ABOUT THE AUTHOR

...view details