తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోల్​కతాలో అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లదాడి - TMC

బంగాల్​ కోల్​కతాలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా చేపట్టిన ఎన్నికల ర్యాలీలో ఘర్షణ చెలరేగింది. కమల దళపతి వాహనశ్రేణి​పై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనతో భాజపా, వామపక్ష విద్యార్థులు పరస్పర దాడులకు దిగారు.

కోల్​కతాలో అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లదాడి

By

Published : May 14, 2019, 8:03 PM IST

Updated : May 14, 2019, 8:17 PM IST

కోల్​కతాలో అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లదాడి

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా బంగాల్​​లో చేపట్టిన రోడ్​షోలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కోల్​కతా వర్సిటీ సమీపంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా అమిత్​షా వాహనశ్రేణి​పై రాళ్లదాడి జరిగింది. కోపోద్రిక్తులైన భాజపా కార్యకర్తలు బిదాన్ సరనీ కళాశాల​ హాస్టల్​ను గెరావ్​ చేశారు. హాస్టల్​ గేటుకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో భాజపా, వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి, పరస్పరం దాడులకు పాల్పడ్డారు. తక్షణం స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Last Updated : May 14, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details