సినీ నటి, ఉత్తర ముంబయి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళా మాతోండ్కర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గందరగోళం చోటుచేసుకుంది. ముంబయిలోని బోరువాలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఊర్మిళ పాల్గొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపానికి ర్యాలీ చేరుకోగానే... కొందరు భాజపా కార్యకర్తలు 'మోదీ... మోదీ' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకింత అసహనానికి లోనయ్యారు. 'చౌకీదార్ చోర్ హై' అని నినదించారు. చివరకు ఇరు పార్టీల కార్యకర్తలు గొడవపడ్డారు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.
ఊర్మిళ ర్యాలీలో భాజపా, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ - Urmila
సినీ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు భాజపా కార్యకర్తలు ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు నినదించారు. ఫలితంగా... ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
ఊర్మిళ ర్యాలీలో మోదీ నినాదాలు.. కార్యకర్తల ఘర్షణ
ఈ ఘటనపై ఉర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
ఉత్తర ముంబయి నుంచి భాజపా సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టిపై కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు ఊర్మిళ.