తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్​పై రాహుల్​ క్షమాపణలకు భాజపా డిమాండ్

రఫేల్​ ఒప్పందంలో కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్​చిట్ ఇవ్వడంపై భాజపా హర్షం వ్యక్తం చేసింది. సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు పయత్నించిన రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి రవిశంకర్​.

By

Published : Nov 14, 2019, 3:28 PM IST

Updated : Nov 14, 2019, 5:29 PM IST

రఫేల్​పై రాహుల్​ క్షమాపణలకు భాజపా డిమాండ్

రఫేల్​పై రాహుల్​ క్షమాపణలకు భాజపా డిమాండ్

రఫేల్ ఒప్పంద వ్యవహారంలో సత్యమే విజయం సాధించిందని భాజపా వ్యాఖ్యానించింది. కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్​చిట్​ ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేసింది.

రఫేల్​పై అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై దిల్లీలో విమర్శల వర్షం కురిపించారు భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. పార్లమెంటులో అబద్ధాలు చెప్పి... దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్​ గాంధీ ప్రయత్నించారని ఆరోపించారు.

"రఫేల్​ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం ఈరోజు తిరస్కరించింది. ఇది నిజం సాధించిన విజయం. దేశ భద్రత సాధించిన విజయం. మోదీ సర్కారు నిజాయతీగా తీసుకున్న నిర్ణయం సాధించిన విజయం. సత్యమే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్​ గాంధీ క్షమాపణ చెప్పాలి. వాళ్లు అవినీతిలో కూరుకుపోయారు."

-రవిశంకర్ ప్రసాద్, కేంద్రమంత్రి.

కాంగ్రెస్ హయాంలో దేశరక్షణకు సంబంధించిన విషయాల్లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు రవిశంకర్. జీపు కుంభకోణం నుంచి భోపోర్స్, జలాంతర్గామి, అగస్టా వెస్ట్​లాండ్​ ఛాపర్ల కొనుగోళ్ల వరుకు అవినీతి అంతకంతకూ పెరిగిందని ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి: కేంద్రానికి 'రఫేల్' ఊరట- మరోమారు సుప్రీం క్లీన్​చిట్

Last Updated : Nov 14, 2019, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details