తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భానుడి భగభగలు- గణేశుడికీ చెమటలు! - Ramshila Thakurbadi Temple

గుడిలో ఉన్న విగ్రహానికి చెమటలు పట్టడం ఎప్పుడైనా చూశారా..? బిహార్​ గయాలో రామ్​శీలా తకుర్బాదీ ఆలయంలోని వినాయకుడి విగ్రహం ఎండ వేడికి స్వేదాన్ని వదులుతోంది. ఆ ప్రతిమను చల్లబరిచేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

భానుడి ప్రతాపం: వినాయక ప్రతిమకూ చెమటలు!

By

Published : Jun 7, 2019, 1:57 PM IST

భానుడి ప్రతాపం: వినాయక ప్రతిమకూ చెమటలు!

నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో మానవులే కాదు గుడిలో ఉన్న దేవుడికీ తిప్పలు తప్పటం లేదు. వేడిమితో గర్భగుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం నుంచి చెమటలు కారుతున్నాయి. ఈ ఘటన బిహార్​ గయా నగరంలోని రామ్​శీలా తకుర్బాదీ ఆలయంలో జరిగింది.

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం స్వామివారి విగ్రహానికి చందనపు పూత పూస్తున్నారు ఆలయ అధికారులు. ప్రతిమను చల్లబరిచేందుకు ప్రత్యేకంగా రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వేడివల్ల వెలువడుతున్న తడిని ఎప్పటికప్పుడూ తుడుస్తున్నట్లు చెప్పారు.

"గయా నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడికి మనుషులు ఇబ్బంది పడుతున్నారు. వేడి ప్రభావం దేవుడిపైనా ఉంది. వేడి నుంచి దేవుడి విగ్రహాన్ని చల్లబరిచేందుకు చందనపు పొడిని విగ్రహానికి లేపనం చేస్తున్నాం. ఫ్యాన్లు ఏర్పాటు చేశాం."

- ఆలయ సిబ్బంది.

విగ్రహానికి చెమటలు వెనుక శాస్త్రీయ కారణం ఉంది. పగడం వంటి శిలతో గణేశుడి విగ్రహాన్ని తయారు చేశారు. ఎప్పుడూ వెచ్చగా ఉండటం ఈ రాయి స్వభావం. అందుకే ఉష్ణోగ్రతలు బాగా పెరిగిన సందర్భాల్లో నీటిని విడుదల చేస్తాయి.

ఆధ్యాత్మికత, శాస్త్రీయ కారణాలు ఉన్నప్పటికీ.. వినాయకుడి విగ్రహాన్ని చల్లబరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆలయ అధికారులు.

ఇదీ చూడండి:బ్రిడ్జ్​ మ్యాన్: పింఛన్​ డబ్బుతో నదిపై వంతెన

ABOUT THE AUTHOR

...view details