తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సౌర శక్తితో నడిచే స్కూటర్​.. గంటకు 49 కిలోమీటర్ల వేగం! - సౌర శక్తితో నడిచే స్కూటర్​.. గంటకు 49 కిలోమీటర్లు వేగం!

రోజురోజుకు భగ్గమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఓ వైపు, అంతకు మించి పెరుగుతున్న కాలుష్యం మరో వైపు. అందుకే సంప్రదాయ శిలాజ ఇంధన వినియోగానికి బదులుగా వినూత్న ఆలోచన చేశారు... కర్ణాటకకు చెందిన ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్. సౌర శక్తితో నడిచే స్కూటర్ తయారు చేసి భవిష్యత్​ పరిశోధనలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఆయన చేస్తున్న కృషి పలువురి మన్ననలు పొందుతోంది.

Scooty which runs with Solar Power
సౌర శక్తితో నడిచే స్కూటర్​.. గంటకు 49 కిలోమీటర్లు వేగం!

By

Published : Dec 4, 2019, 5:33 PM IST

సౌర శక్తితో నడిచే స్కూటర్​.. గంటకు 49 కిలోమీటర్లు వేగం!

సోలార్‌ స్కూటీని నడుపుతున్న ఇతని పేరు విజయ్‌కుమార్. హసన్‌లోని మలేనాడు టెక్నికల్ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వాహన కాలుష్యాన్ని నివారించేందుకు సౌర శక్తితో నడిచే స్కూటర్‌ను రూపొందించారు. దీనికోసం అనేక పరిశోధనలు చేశారు.

గంటకు 49 కిలోమీటర్లు

విజయ్‌కుమార్‌ తయారు చేసిన సోలార్‌ స్కూటర్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. స్కూటీ నిర్మాణం కోసం సోలార్ పలకలతో పాటు.. పాత పరికరాలను ఉపయోగించారు. తేలికపాటి ఇంజన్‌తో నడవటం దీని ప్రత్యేకత. గంటకు 49 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ స్కూటర్‌ ప్రయాణించగలదు.

సౌర విమానం కోసం ప్రయత్నాలు

విజయ్‌ కుమార్‌ పరిశోధనలు కేవలం సోలార్ స్కూటర్ వరకే పరిమితం కాలేదు. ఆయన పరిశోధనాభిరుచి అనేక ఇతర గృహోపకరణాల రూపకల్పనకూ బీజం వేసింది. సౌర శక్తితో నడిచే ఎయిర్ కూలర్, వాక్యూమ్ క్లీనర్‌లను తయారు చేశారు. అంతే కాకుండా సౌర శక్తితో నడిచే తేలికపాటి విమానం కోసం పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుత పరిశోధనలు ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ.. భవిష్యత్​లో తక్కువ ఖర్చుతో వాణిజ్య పరంగా వాహనాలను ఉత్పత్తి చేస్తానని విజయకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details