తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరడుగుల దూరం పాటించినా కరోనా సోకుతుంది! - corona with air

ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరడుగుల భౌతిక దూరంతో ఉపయోగం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి ద్వారా కరోనా 4.8 మీటర్ల దూరం వరకు వ్యాపిస్తుందన్నారు. కరోనాతో ప్రజారోగ్యం మరింత చిక్కుల్లో పడిందని హెచ్చరిస్తున్నారు.

scientists-warns-that-6-feet-social-distance-is-not-enough-to-be-safe-from-corona-virus-spread
ఆరడుగుల దూరం పాటించినా కరోనా సోకుతుంది!

By

Published : Aug 13, 2020, 5:54 PM IST

గాలిద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పాటిస్తున్న రెండు మీటర్ల భౌతికదూరంతో ఉపయోగం లేదని హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి, క్లస్టర్లను అడ్డుకోవాలంటే ఇప్పుడున్న మార్గదర్శకాలను సవరించాలని సూచిస్తున్నారు. మెడ్‌రెక్సివ్‌లో పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు.

ఇండోర్‌ వాతావరణంలో 2 నుంచి 4.8 మీటర్ల దూరం వరకు గాలిద్వారా వైరస్‌ సంక్రమిస్తుందని పరిశోధకులు తెలిపారు. చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్‌ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని పేర్కొన్నారు. దగ్గుతూ, చీదుతూ, మాట్లాడే వారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కొవిడ్‌-19 సోకుతుందని స్పష్టం చేశారు.

"ప్రజారోగ్యం ఇప్పుడు మరింత చిక్కుల్లో పడింది. భౌతికదూరం పాటించడం, జన సమ్మర్థ ప్రాంతాల్లోకి వెళ్లకపోవడం, చేతులు కడుక్కోవడం, ముఖం కవర్‌ చేసుకోవడంలో మరింత జాగ్రత్త అవసరం. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తున్నప్పుడు రెండు మీటర్లు లేదా ఆరడుగల భౌతికదూరంతో లాభం లేదు. కార్యాలయాల్లో ఆరడుగుల భౌతికదూరం ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. మరింత వ్యాప్తి, వైరస్‌ ప్రజ్వలన కేంద్రాలకు దారితీస్తుంది" అని పరిశోధకులు హెచ్చరించారు.

తొలుత ఆస్పత్రుల బయట కరోనా వైరస్‌ గాల్లో వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించింది. వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖ రాయడంతో వారి వాదనను అంగీకరించింది. అయితే మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: పైలట్ తిరిగొచ్చినా యథావిధిగా బలపరీక్ష!

ABOUT THE AUTHOR

...view details