అన్లాక్ 5.0లో భాగంగా ఈ నెల 15 తర్వాత పాఠశాలలను తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. అయితే రాష్ట్రాల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. ఇప్పట్లో పాఠశాలలను తెరవకూడదని పలు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగా.. మరికొన్ని సందిగ్ధంలో పడ్డాయి. ఇంకొన్ని రాష్ట్రాలు మాత్రం జాగ్రత్తలతో పాఠశాలలను తెరిచేందుకు సన్నద్ధమయ్యాయి. మరి స్కూళ్లను తెరిచే విషయంలో ఏ రాష్ట్రం ఏమంటోంది?
దిల్లీ:-
- ఈ నెల 31వరకు పాఠశాలలు మూతపడే ఉంటాయి.
- పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఉత్తర్ప్రదేశ్:-
- కంటైన్మెంట్ జోన్లు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 9-12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలు తెరుచుకుంటాయి.
- షిఫ్టులవారీగా తరగతులు నిర్వహిస్తారు. తల్లిదండ్రులిచ్చిన అనుమతి పత్రాన్ని చూపిస్తేనే క్లాసుల్లోకి ప్రవేశం ఉంటుంది.
కర్ణాటక:-
- స్కుళ్లు తెరిచేందుకు ప్రభుత్వం విముఖంగా ఉంది. పిల్లల ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తున్నట్టు స్పష్టం చేసింది.
- పరిస్థితులను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొంది.