తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెప్టెంబర్​ 1 నుంచి మోగనున్న బడి గంట.. కానీ.. - పాఠశాలల పునఃప్రారంభం

కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థల పునఃప్రారంభానికి కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ దేశాల్లో అమలు చేసిన తీరును పరిశీలించి తర్వాత మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సెప్టెంబర్​ 1 నుంచి నవంబర్​ 14లోగా దశలవారీగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే స్థానిక పరిస్థితులను బట్టి తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని నిర్ణయించింది.

schools reopen
పాఠశాలలు

By

Published : Aug 8, 2020, 8:10 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పునః ప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. పలు దేశాలు విద్యా సంస్థలను తెరిచిన తీరుపై అధ్యయనం సాగించిన మీదట, ఈ విషయమై మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ను విడుదల చేయనుంది. విద్యా సంస్థలను తెరిచే విషయమై వీటిలో కూలంకషంగా వివరించనుంది.

"లాక్‌డౌన్‌ ఎత్తివేత క్రమంలో ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడు, ఏ విధానంలో తరగతులకు హాజరుకావచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాలి. ఈ విషయంలో కొవిడ్‌-19 కేసుల తీరును పరిశీలించడంతో పాటు పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. " ఆని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

కేంద్ర ఇచ్చే సూచనలు..

బోధన సిబ్బంది, విద్యార్థుల్లో 33% సామర్థ్యంతో బడులు షిఫ్టుల వారీగా తరగతులు నడపాలని, తరగతి గదుల్లో విద్యార్థులు 2-3 గంటలు మాత్రమే ఉండేలా చూడాలి.

మొదటి షిఫ్టు ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ; రెండో షిఫ్టును 12 నుంచి 3 గంటల వరకూ నిర్వహించాలి. రెండు షిఫ్టుల మధ్యనుండే సమయంలో తరగతి గదులను శానిటైజ్‌ చేయాలి.

ప్రస్తుతం మాత్రం 10 నుంచి 12వ తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి. చిన్నారులకు మాత్రం ఆన్‌లైన్‌ తరగతులనే కొనసాగించాలి. సెక్షన్ల వారీగా విద్యార్థులు నిర్దిష్ట రోజుల్లో నేరుగా బడులకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:ఆన్​లైన్ పాఠాల్లో అపశ్రుతులు

ABOUT THE AUTHOR

...view details