కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ మే 3తో ముగియనుంది. ఆ తర్వాత కూడా విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రవాణా సౌకర్యాలు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఉండటం వంటి వాటి మున్ముందు కూడా ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.
కరోనా పోరుకోసం వ్యూహాన్ని రూపొందించేదుకు ఇవాళ సమావేశం నిర్వహించారు అధికారులు. దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగించాలా? వద్దా? అనే విషయంపై ఈ వారాంతంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మే నెల మధ్య నుంచి కరోనా పరిస్థితికి అనుగుణంగా పలు ప్రాంతాల్లో రైలు, విమాన సేవలు పునరుద్ధరించే అవకాశాలున్నాయన్నారు.
కరోనా ప్రభావం లేని గ్రీన్ జోన్లలో పరిమిత సంఖ్యలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైలు, విమాన సేవలు మాత్రం ఇప్పట్లో ప్రారంభం కావని స్పష్టం చేశారు..
మోదీతో ముఖ్యమంత్రులు