కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించే అంశంపై స్పష్టతనిచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ సౌమ్య స్వామినాథన్. అన్ని రకాల భద్రతా చర్యలతో పాఠశాలలను నిర్వహించవచ్చని తెలిపారు. అయితే.. తప్పనిసరిగా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
"పాఠశాలలను ప్రారంభించడమనేది స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలను తెరవొద్దు. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలను, ప్రయోజనాలను అంచనా వేసుకోవాలి."