తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా నేటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం

కరోనా వైరస్​ విజృంభణతో దేశంలో పాఠశాలలు మూతపడ్డాయి. అన్​లాక్​-4లో భాగంగా నేటి నుంచి పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతించింది కేంద్రం. 9-12వ తరగతుల విద్యార్థులు స్వచ్ఛందంగా పాఠశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది.

Schools and colleges would reopen
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

By

Published : Sep 21, 2020, 6:01 AM IST

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలు నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి అన్​లాక్​-4లో భాగంగా ఇవాళ నుంచి అనుమతులు ఇచ్చింది కేంద్రం. 9-12వ తరగతి విద్యార్థులు సెప్టెంబర్​ 21 నుంచి స్వచ్ఛందంగా పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది.

5 నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. తల్లిదండ్రుల సమ్మతితో విద్యార్థులు పాఠశాలకు హాజరుకానున్నారు. లేదంటే ఆన్​లైన్​ తరగతులు వినేందుకు అవకాశం ఉంటుంది.

పాఠశాలలు ప్రారంభిస్తున్న క్రమంలో కరోనా విజృంభించే ప్రమాదం ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తిగా కనుమరుగయ్యే వరకు పాఠశాలలు తెరవొద్దని పేర్కొంటున్నారు.

దిల్లీలో అక్టోబర్​ 5 తర్వాతే..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నేటి నుంచి పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. దేశ రాజధాని దిల్లీలో మాత్రం అక్టోబర్​ 5 వరకు స్కూళ్లు మూసే ఉంటాయి. కరోనా విజృంభిస్తున్న వేళ పాఠశాలలను తెరిచే అవకాశం లేదని దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఆన్​లైన్​ తరగతులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సిలబస్​ తగ్గింపు..

కరోనా నేపథ్యంలో.. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాల విద్యార్థుల సిలబర్​ను 40 శాతం తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది తమిళనాడు. 18 మందితో ఏర్పాటు చేసిన ప్యానెల్​ సూచనల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మార్చి 16 నుంచి మూసివేత..

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మార్చి 16 నుంచి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేశారు. అనంతరం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. లాక్​డౌన్​ అనతంరం ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించాయి ఆయా రాష్ట్రాలు. అన్​లాక్​-4లో మార్గదర్శకాల్లో భాగంగా పాఠశాలలు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. గరిష్ఠంగా 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు ఓకే చెప్పింది.

ఇదీ చూడండి: సగం మంది సిబ్బంది.. హాజరైతే చాలు!

ABOUT THE AUTHOR

...view details