భారత్ పర్యటనలో భాగంగా దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. దక్షిణ దిల్లీలోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలలో సుమారు గంటపాటు విద్యార్థులతో గడిపారు మెలానియా. తరగతి ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో విద్యార్థులు ఆమెపై ప్రశ్నలు సంధించారు.
అమెరికా ఎంత పెద్దదని ఓ బాలిక అడగగా.. భారత్ నుంచి అగ్రరాజ్యం దూరమా? అని మరో బాలిక, ప్రథమ మహిళగా మీరు ఏమి చేస్తారని ఇంకో చిన్నారి ప్రశ్నించింది. వారి ప్రశ్నలకు నవ్వుతూ బదులిచ్చారు మెలానియా.