తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీన్​ రివర్స్​: నాడు అమిత్​ షా.. నేడు చిదంబరం!

2010లో కేంద్ర హోంమంత్రిగా పి. చిదంబరం హయాంలోనే సోహ్రబుద్దీన్ లాకప్​ డెత్​ కేసులో అరెస్టయ్యారు అమిత్​షా. ప్రస్తుతం హోంమంత్రిగా షా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాటి హోంమంత్రి చిదంబరం ఐఎన్​ఎక్స్ కేసులో షా హయాంలో అరెస్టయ్యారు.

By

Published : Aug 22, 2019, 7:45 AM IST

Updated : Sep 27, 2019, 8:30 PM IST

సీన్​ రివర్స్​: నాడు చిదంబరం హయాంలో ​షా అరెస్టు

యూపీఏ-2 హయాం... 2010లో కాంగ్రెస్ నేత పి. చిదంబరం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2002-2014 మధ్య గుజరాత్ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అమిత్​ షా. అదే సమయంలో 2005లో గుజరాత్ పోలీసులు సోహ్రబుద్దీన్ షేక్ అనే నేరస్థుడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలోనే సోహ్రబుద్దీన్ మృతి చెందారు. సుప్రీం ఆదేశాలతో అపహరణ, హత్య ఆరోపణ కింద 2010లో అమిత్​షా అరెస్టయ్యారు.

కట్​ చేస్తే... పదేళ్ల అనంతరం అమిత్​షా కేంద్ర హోంమంత్రి. ప్రస్తుతం ఐఎన్​ఎక్స్ కేసులో చిదంబరాన్ని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.

ఇదీ చూడండి: తొలి రఫేల్​ యుద్ధ విమానానికై ఫ్రాన్స్​కు రక్షణమంత్రి

Last Updated : Sep 27, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details