తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం బెయిల్ పిటిషన్​పై రేపే సుప్రీం తీర్పు..! - చిదంబరం బెయిల్

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత చిదంబరం బెయిల్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. నవంబర్ 28న తీర్పు వాయిదా వేసిన జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం రేపు తీర్పు వెలువరించనుంది.

SC verdict Wednesday on Chidambaram's bail plea in INX Media money laundering case
చిదంబరం బెయిల్ అభ్యర్థనపై రేపు సుప్రీం తీర్పు

By

Published : Dec 3, 2019, 8:18 PM IST

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం బెయిల్‌ అభ్యర్థనపై సుప్రీంకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. దిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరిస్తూ నవంబర్‌ 15న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చిదంబరం.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపైనవంబర్‌ 28న వాదోపవాదనలు విన్న జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

ఈడీ వాదనలు

కస్టడీలో ఉన్నప్పటికీ.. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కోర్టులో వాదించింది. అధికారంలో ఉన్న వారు ఇలాంటి నేరాలకు పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందని ఈడీ తరపు న్యాయవాది, సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వెల్లడించారు.

ఎలాంటి సాక్ష్యాలు లేవు

అయితే నిరాధార ఆరోపణలతో ఈడీ తన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించకూడదని కోర్టుకు చిదంబరం తెలిపారు. కాంగ్రెస్​ నేత ఈ నేరానికి పాల్పడినట్లు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సాక్ష్యాలు లేవని చిదంబరం తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు.

ABOUT THE AUTHOR

...view details