పీఎం కేర్స్ నిధులను ఎన్డీఆర్ఎఫ్కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీ దుర్మార్గపు ఆలోచనలకు, ఆయనకు వత్తాసు పలికే వారికి చెంపపెట్టు లాంటిదన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. కాంగ్రెస్, దాని అనుచరుల హానికర ప్రయత్నాలు విఫలమై వాస్తవమే గెలిచిందన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
"పీఎం కేర్స్ నిధులపై సుప్రీం తీర్పు.. రాహుల్, అద్దె కార్యకలాపాలు నిర్వహించే ఆయన మద్దతుదారులకు కోలుకోలేని దెబ్బ. పీఎం కేర్స్‌కు విరాళాలిచ్చిన సాధారణ పౌరులంతా రాహుల్ తప్పుడు ప్రచారాలను తిరస్కరించారు. ప్రజల ద్వారా సేకరించిన పీఎంఎన్ఆర్ఎఫ్ నిధులను కాంగ్రెస్ కుటుంబ ట్రస్టులకు బదిలీ చేసుకుని దశాబ్దాలుగా వాడుకుంది. పీఎం కేర్స్‌పై తప్పుడు ప్రచారం చేయాలనుకోవడం కాంగ్రెస్ పాపాలను కడగడానికి చేసిన ప్రయత్నమని దేశ ప్రజలందరికీ తెలుసు. "
-జేపీ నడ్డా ట్వీట్