తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' మజా: డిసెంబరు 1 కాదు.. ఈనెల​ 28నే ఠాక్రే ప్రమాణం

sc-to-pass-order-on-plea-against-maharashtra-government-formation
'మహా' రాజకీయంపై కాసేపట్లో సుప్రీం తీర్పు

By

Published : Nov 26, 2019, 10:05 AM IST

Updated : Nov 26, 2019, 11:22 PM IST

23:19 November 26

ప్రమాణ తేదీ మార్పు.. నవంబర్​ 28నే ఠాక్రే పట్టాభిషేకం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు ఈ నెల 28నే చేపట్టనున్నారు శివసేనాని ఉద్ధవ్​ ఠాక్రే. గవర్నర్​ బీఎస్​ కోశ్యారీ కోరిక మేరకు ముందుగా అనుకున్న తేదీలో స్వల్ప మార్పు చేశారు. 
అంతకుముందు ముంబయిలోని ట్రైడెంట్​ హోటల్​లో భేటీ అయిన మహావికాస్ అఘాడీ నేతలు.. తమ నాయకుడిగా ఉద్ధవ్​ ఠాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం ప్రమాణస్వీకారోత్సవాన్ని డిసెంబరు​ 1న చేయాలని మొదటగా నిర్ణయించారు. 

అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీని కలిశారు ఠాక్రే. కూటమి నేతలతో కలిసి వెళ్లిన ఆయన గవర్నర్​తో రెండు గంటలపాటు చర్చించారు. అయితే ఈ నెల 28నే ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఠాక్రేను గవర్నర్​ కోరారు. ఫలితంగా ప్రమాణ తేదీని మార్చారు శివసేన అధ్యక్షుడు.
 

23:12 November 26

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 28నే జరగనుంది. తొలుత డిసెంబరు 1న ఉంటుందని శరద్​ పవార్​ ప్రకటించినప్పటికీ.. గవర్నర్​ కోరిక మేరకు మూడు రోజులు ముందుగానే సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు ఠాక్రే.

22:55 November 26

బాల్‌ ఠాక్రేకు నివాళులర్పించిన ఉద్ధవ్‌

శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేకు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఉద్ధవ్‌ ఠాక్రే నివాళులర్పించారు. మహా వికాస్‌ కూటమి నేతగా ఎన్నికైన అనంతరం తన నివాసం మాతోశ్రీకి వెళ్లి తండ్రి చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. ఠాక్రే కుటుంబంలో ఇంతవరకు ఏ ఒక్కరూ శాసనసభకు పోటీ చేయలేదు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఉద్ధవ్‌ తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేసి విజయం సాధించారు. ఆయన వర్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలుత ఆదిత్య ఠాక్రేనే సీఎం అభ్యర్థిగా భావించినప్పటికీ తర్వాత జరిగిన కీలక పరిణామాలతో ఆయన స్థానంలో ఉద్ధవ్‌ను ఎన్నుకున్నారు.

21:50 November 26

శరద్​ పవార్​ నివాసానికి చేరుకున్న అజిత్ పవార్​

ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తన బాబాయి శరద్​ పవార్​ను కలిసేందుకు వెళ్లారు అజిత్ పవార్. ముంబయిలోని పవార్​ నివాసమైన సిల్వర్​ ఓక్​కు చేరుకున్నారు అజిత్​.

21:40 November 26

ముంబయిలో భాజపా సమావేశం

ముంబయిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఇందుకోసం పార్టీ కార్యాలయానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవీస్ చేరుకున్నారు. 

21:36 November 26

రాజభవన్​కు చేరుకున్న అఘాడీ నేతలు

ట్రైడెంట్  హోటల్​లో మహావికాస్​ అఘాడీ సమావేశం ముగిసిన అనంతరం 3 పార్టీల నేతలు రాజ్​భవన్​కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్​తో చర్చించనున్నారు. 

21:33 November 26

శరద్​ పవార్​ను కలవనున్న అజిత్ పవార్​

శరద్​ పవార్​ కలవనున్న ఆయన అన్న కుమారుడు అజిత్​ పవార్​. శ్రీనివాస్ పవార్​ ఇంటి నుంచి సిల్వర్​ ఓక్​ (శరద్​ పవార్ నివాసం)కు బయలుదేరిన అజిత్​ పవార్​.

20:53 November 26

ఠాక్రే ప్రమాణ స్వీకారానికి మోదీ-షా!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణం చేయడం లాంఛనంగా కనిపిస్తోంది. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేనల మహా అఘాడీ కూటమి నేతగా ఠాక్రే మహారాష్ట్ర సీఎం పగ్గాలు అందుకోనున్నారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ మైదానంలో డిసెంబరు 1న కేబినెట్​తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఠాక్రే. ఇందుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోమంత్రి అమిత్​ షాను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు సేన సీనియర్ నేత సంజయ్ రౌత్​.

20:29 November 26

'సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు'

ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామాతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన సమాయత్తమవుతున్నాయి. మూడు పార్టీల కూటమికి మహా వికాస్‌ అఘాఢీగా నామకరణం చేశారు. 
ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటు, విధి విధానాలపై ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ కూటమి నాయకుడిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ముఖ్యమంత్రిగా..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఠాక్రేకే మొగ్గు చూపారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే డిసెంబర్‌ 1న ప్రమాణం చేయనున్నారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం కుర్చీలో కూర్చొనే ఘనత ఉద్ధవ్​దే కానుంది.

కలలో కూడా ఊహించలేదు..

ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంపై ఉద్ధవ్​ ఠాక్రే సంతోషం వ్యక్తం చేశారు. ఫడణవీస్ చేసిన ప్రతి ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 

"రాష్ట్రాన్ని పాలిస్తానని కలలో కూడా ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు. మీరందరూ నాపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా. ఛత్రపతి శివాజీ కోరుకున్న మహారాష్ట్రను పునర్నిర్మిద్దాం. ఫడణవీస్​ లేవనెత్తిన ప్రశ్నలంటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నేను దేనికీ భయపడట్లేదు."
-ఉద్ధవ్​ ఠాక్రే, శివసేన అధినేత

ఈ సమావేశం నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రైడెంట్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడణవీస్‌ను గవర్నర్‌ ఆహ్వానించడానికి ముందు ఈ నెల 22న మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే అవి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 

20:01 November 26

డిసెంబరు 1న ప్రమాణ స్వీకారం!

ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవిస్‌ రాజీనామాతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన ఏర్పాట్లు ప్రారంభించాయి. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా  శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే డిసెంబర్‌ 1న ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ముంబయిలోని శివాజీ పార్క్‌ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిసింది. మూడు పార్టీల కూటమికి మహా వికాస్‌ అఘాడీగా నామకరణం చేశారు. 

ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటు, విధి విధానాలపై ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన అగ్రనేతలు భేటీ అయి చర్చించారు. ఈ సమావేశం నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రిడెంట్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడణవిస్‌ను గవర్నర్‌ ఆహ్వానించడానికి ముందు ఈ నెల 22న మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే అవి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 
 

19:57 November 26

మహా ముఖ్యమంత్రిగా ఉద్దవ్​ ఠాక్రే

  • మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే
  • ఉద్ధవ్ ఠాక్రేను ఎంపిక చేసిన శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమి ఏర్పాటుకు3పార్టీల భేటీలో ఆమోదం

19:47 November 26

'మహా వికాస్​ అఘాడీ' కూటమి

మహారాష్ట్రలో శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ కలయికతో 'మహా వికాస్​ అఘాడీ' కూటమి ఏర్పాటయింది. ఈ మేరకు ట్రైడెంట్​ హోటల్​లో మూడు పార్టీల ఎమ్మెల్యేల సమక్షంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు శివసేన నేత ఏక్​నాథ్​ షిండే. ఇందుకు ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవ మద్దతు తెలిపారు.

19:08 November 26

  • ముంబయి: ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సభ్యులు
  • కూటమి నేతగా ఉద్ధవ్‌ ఠాక్రేను ఎన్నుకోనున్న3పార్టీల ఎమ్మెల్యేలు
  • సమావేశానికి హాజరైన శరద్ పవార్‌,ఉద్ధవ్ ఠాక్రే,ఆదిత్య ఠాక్రే
  • రాత్రి8.30గంటలకు గవర్నర్‌ను కలవనున్న3పార్టీల నేతలు

18:17 November 26

తదుపరి ముఖ్యమంత్రి ఠాక్రే!

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేనే అని ప్రకటించారు ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​. మరికాసేపట్లో కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన నేతలు సమావేశమైన తర్వాత గవర్నర్​ కలవనున్నట్లు స్పష్టం చేశారు. భాజపా అహంకారంతోనే ఫడనవీస్​ ప్రభుత్వం కూలిపోయిందని ఘాటు విమర్శలు చేశారు మాలిక్​. 

18:02 November 26

రేపు ఉదయం 8 గంటలకు మహా నూతన శాసనసభ

మహారాష్ట్ర నూతన శాసనసభ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్​ కాళిదాస్​ ప్రమాణం చేయిస్తారు. 

17:52 November 26

కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన ఎమ్మెల్యేల భేటీ

ఇవాళ  సాయంత్రం 6.30 గంటలకు శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకోనున్నారు.

17:34 November 26

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా భాజపా ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోశ్యారీ అయనతో ప్రమాణం చేయించారు.

17:10 November 26

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్​గా కాళిదాస్​

  • మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా భాజపా ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్‌ నియామకం
  • రాజ్‌భవన్‌లో కాసేపట్లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్న కొలాంబ్కర్‌

16:27 November 26

గవర్నర్​కు రాజీనామా లేఖ సమర్పించారు దేవేంద్ర ఫడణవీస్.

16:21 November 26

ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. దేవేంద్ర ఫడణవీస్​ రాజీనామాను ఆమోదించి, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమ కూటమిని ఆహ్వానించాలని గవర్నర్​ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత పృధ్వీ రాజ్ చవాన్.

16:11 November 26

రాజీనామా సమర్పించేందుకు రాజ్​భవన్​కు చేరుకున్న దేవేంద్ర ఫడణవీస్.

15:47 November 26

శివసేన మమ్మల్ని బెదిరించింది!
 

శివసేనపై తీవ్ర విమర్శలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీ తమను బెదిరించిందని చెప్పారు. 

"ప్రజలు మహాకూటమి(భాజపా-శివసేన)కే పట్టం కట్టారు. భాజపాకు అత్యధికంగా 105 సీట్లు వచ్చాయి. కూటమి విజయం భాజపా కారణంగా వచ్చిందే. ఎందుకంటే భాజపా పోటీ చేసిన 70శాతం స్థానాల్లో గెలిచింది.
ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇస్తే వారితో కలుస్తామని శివసేన మాకు ఎన్నికల ఫలితాల ముందే చెప్పింది. ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తుందని చాలా కాలం వేచి చూశాం. కానీ వారు ఎన్​సీపీ-కాంగ్రెస్​తో చర్చలు జరిపారు. మాతోశ్రీ(ఠాక్రేల అధికారిక నివాసం) దాటి బయటకు రాని వారు ఎన్​సీపీ, కాంగ్రెస్​తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గడపగడపకూ తిరుగుతున్నారు."
        -దేవేంద్ర ఫడణవీస్

15:41 November 26

ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడణవీస్​ రాజీనామా చేశారు. ముంబయిలో మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కాసేపట్లో రాజ్​భవన్​కు వెళ్లి, గవర్నర్​కు లేఖ సమర్పించనున్నట్లు తెలిపారు.

అజిత్​ పవార్​ రాజీనామా తర్వాత అధికారంలో కొనసాగేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకు లేదని చెప్పారు దేవేంద్ర. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడకుండా, ప్రతిపక్షంగా ఉండడమే మేలని తమ పార్టీ భావించినట్లు వెల్లడించారు. ఇకపై భాజపా మహారాష్ట్రలో ప్రజాపక్షాన గళం వినిపిస్తుందని స్పష్టంచేశారు.

15:41 November 26

దేవేంద్ర ఫడణవీస్​ మీడియాతో మాట్లాడుతున్నారు. రాజీనామాపై కాసేపట్లో ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు.

15:36 November 26

  • సాయంత్రం 5 గం.కు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ
  • కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకోనున్న 3 పార్టీల ఎమ్మెల్యేలు

15:36 November 26

ఉద్ధవ్​నే సీఎం

ఐదేళ్ల పాటు శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ కూటమి నేతల సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ ఇప్పుడు శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ కూటమితోనే ఉన్నారని చెప్పారు.

15:21 November 26

దటీజ్ పవార్... శరద్​ ఎత్తుతో భాజపా షాక్
 

నెలరోజులుగా జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. సొంతపార్టీని వదిలి భాజపా పక్షాన చేరిన ఎన్​సీపీ నేత అజిత్ పవార్.... ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం తీసుకున్నారు అజిత్.

శరద్​ వ్యూహంతోనే...

అజిత్ నిర్ణయానికి ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ అమలు చేసిన తెరవెనుక వ్యూహమే కారణంగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ద్వారా అజిత్​పై శరద్​ ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. శరద్ పవార్​ కుమార్తె సుప్రియా సూలే భర్త... ఇందుకోసం గత రాత్రి అజిత్​తో చర్చలు జరిపినట్లు సమాచారం. 

ముందు నుంచి వ్యూహాత్మకంగా...

అజిత్​ పవార్​ భాజపా పక్షాన చేరినా... శరద్​ పవార్​ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. "అవి అజిత్​ వ్యక్తిగత నిర్ణయాలు" అనడం మినహా ఆయనపై పెద్దగా విమర్శలు చేయలేదు. పార్టీ నుంచి సస్పెండ్​ చేయలేదు. అజిత్​ను పార్టీలోకి తిరిగి తీసుకునేందుకు వీలుగానే శరద్​ ఇలా చేశారని సమచారం. చివరకు శరద్​ పవార్​ వ్యూహం ఫలించింది. 
 

15:13 November 26

  • బలపరీక్షకు ముందే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం
  • ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా
  • బలపరీక్షకు ముందే వెనక్కి తగ్గిన అజిత్‌ పవార్‌
  • కుటుంబసభ్యుల ద్వారా తీవ్ర ఒత్తిడి తెచ్చిన శరద్‌ పవార్‌
  • రేపటి బలపరీక్షకు ముందే చక్రం తిప్పిన శరద్‌ పవార్‌
  • పార్టీలోకి తిరిగి తీసుకునేందుకు వీలుగా ఎన్సీపీ నుంచి అజిత్‌ను సస్పెండ్‌ చేయని శరద్‌ పవార్‌
  • బలపరీక్షకు ముందే సీఎం ఫడణవీస్‌ కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు
  • మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్న సీఎం దేవేంద్ర ఫడణవీస్‌
  • అజిత్‌ పవార్‌‌ను రాజీనామా చేసేలా ఒప్పించిన శరద్‌ పవార్‌ సతీమణి, అల్లుడు
  • మహారాష్ట్ర పరిణామాలపై చర్చించిన ప్రధాని,అమిత్‌ షా,జేపీ నడ్డా

14:46 November 26

అనూహ్య నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య మలుపు. ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు. బుధవారం బలపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిగంటలకే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

దేవేంద్ర ఫడణవీస్ కూడా రాజీనామా చేస్తారని సమాచారం. మూడున్నరకు మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించే అవకాశముంది. 

14:30 November 26

ఫడణవీస్​ మీడియా సమావేశం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ మధ్యాహ్నం మూడున్నర గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

14:25 November 26

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బలపరీక్ష కోసం ఇరు పక్షాలు సిద్ధమవుతున్నాయి. తమకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి.

ఎన్​సీపీ, శివసేన, కాంగ్రెస్​ శాసనసభ్యులు సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నారు. కూటమి నేతను ఎన్నుకోనున్నారు.

భాజపా సైతం ఇదే తరహా సమావేశం ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడణవీస్​ వీరందరినీ ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

14:22 November 26

పార్టీల భేటీలు...

  • సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల కీలక భేటీ
  • ముంబయిలోని సోఫీటేల్ హోటల్‌లో  భేటీకానున్న3 పార్టీల నేతలు
  • ఇప్పటికే హోటల్‌కు చేరుకున్న శరద్ పవార్, జయంత్ పాటిల్, సుప్రియ సూలే

12:34 November 26

భాజపా భేటీ...

  • ముంబయిలో భాజపా కోర్ కమిటీ సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్
  • రేపటి బల పరీక్షకు వ్యూహ రచనలో భాజపా కోర్ కమిటీ

12:33 November 26

భాజపా భేటీ...

  • ముంబయిలో భాజపా కోర్ కమిటీ సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్
  • రేపటి బల పరీక్షకు వ్యూహ రచనలో భాజపా కోర్ కమిటీ

11:29 November 26

ప్రజాస్వామ్యంలో మైలురాయి: ఎన్​సీపీ

మహారాష్ట్ర వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎన్​సీపీ స్వాగతించింది. రాజ్యాంగ దినోత్సవం రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​. రేపటితో భాజపా ఆట ముగిసిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

11:15 November 26

స్వాగతించిన కాంగ్రెస్...

సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్​ స్వాగతించింది. రేపు బలపరీక్షలో శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ కూటమి విజయం సాధించడం తథ్యమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫృథ్వీరాజ్​ చవాన్​ ధీమా వ్యక్తం చేశారు. దేవంద్ర ఫడణవీస్​ ఈరోజే పదవికి రాజీనామా చేయాలని హితవు పలికారు. 

10:47 November 26

రేపు సాయంత్రం 5 గంటల లోపే...

రేపే మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష ప్రక్రియ ముగించాలని ఆదేశించింది. బలపరీక్షను మొత్తం వీడియో తీయాలని సుప్రీం కోర్టు ఉద్ఘాటించింది. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. బహిరంగ బ్యాలెట్‌ విధానంలో బలపరీక్ష నిర్వహించాలని వ్యాఖ్యానించింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని తెలిపింది. ప్రొటెం స్పీకర్‌ను నియమించి.. బలపరీక్ష ఒక్కటే అజెండాగా ఉండాలని స్పష్టం చేసింది.

10:42 November 26

రేపు సాయంత్రం 5 గంటల లోపు...

మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సభ కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతించింది.

10:36 November 26

రేపే బలపరీక్ష...

మహారాష్ట్రలో రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

10:18 November 26

మరి కాసేపట్లో...

మహారాష్ట్ర వ్యవహారంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. రెండు రోజులపాటు సుప్రీం కోర్టులో విచారణ సాగింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని కోర్టును కోరింది శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి. బలపరీక్షకు తొందరపడాల్సిన అవసరం లేదని భాజపా వాదించింది.

09:02 November 26

'మహా' రాజకీయంపై సుప్రీం తీర్పు

'మహా' రాజకీయంపై కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడనుంది. భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. భాజపా నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఫడణవీస్​ను.. గవర్నర్​ ఆహ్వానించడాన్ని సవాల్​ చేస్తూ శివసేన, కాంగ్రెస్​, ఎన్సీపీ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు విన్న ధర్మాసనం మరికొద్ది నిముషాల్లో ఆదేశాలు ఇవ్వనుంది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించే అంశంపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Last Updated : Nov 26, 2019, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details