తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్​ కుమార్​ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మధ్యాహ్నం 12:30 గంటలకు వాదనలు విననుంది.

SC to hear plea of one of four death row convicts against dismissal of mercy plea
నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్​పై నేడు సుప్రీం విచారణ

By

Published : Jan 28, 2020, 5:46 AM IST

Updated : Feb 28, 2020, 5:37 AM IST

నిర్భయ దోషి దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్​ కుమార్ శనివారం​ అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాడు.

జస్టిస్​ ఆర్​ భానుమతి, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నతో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పిటిషన్​ను విచారించనుంది.

ముకేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. ఈనెల 17న తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తన పిటిషన్‌ను వెంటనే విచారణ చెయ్యాలని నిర్భయ దోషి ముకేశ్‌ కుమార్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పందించి... కోర్టు రిజిస్ట్రరీలో ఈ పిటిషన్​ను చేర్చమని అతడి తరఫు న్యాయవాదికి సూచించింది. ఉరిశిక్ష పడిన వ్యక్తి పిటిషన్‌ విచారణకు మించి అత్యవసరమైనది ఏదీ లేదని సీజేఐ అన్నారు. ఈ పిటిషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు ఉరి ట్రయల్స్​

మరోవైపు ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు దోషులను ఉరి తీయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉరి తీసే ప్రక్రియకు సంబంధించిన ట్రయల్స్​ను తీహార్​ జైలు అధికారులు సోమవారం పూర్తి చేశారు. ఉరి తీసే పరికరాలను పరీక్షించడానికి మూడోసారి ఈ ట్రయల్స్​ నిర్వహించారు. రానున్న రోజుల్లో కూడా పరికరాలను పరీక్షిస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Feb 28, 2020, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details