తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ములాయం, అఖిలేశ్​ ఆస్తుల కేసుపై 25న విచారణ - విశ్వనాథ్ చతుర్వేది

సమాజ్​వాదీ పార్టీ నేత ములాయం సింగ్​ యాదవ్​, అతని కుమారుడు అఖిలేశ్​ ఆస్తుల కేసును సుప్రీం కోర్టు ఈ నెల 25న విచారించనుంది. దర్యాప్తు నివేదికను న్యాయస్థానంలో సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిల్​ దాఖలు చేశారు రాజకీయ కార్యకర్త విశ్వనాథ్​ చతుర్వేది.

ములాయం, అఖిలేశ్​ ఆస్తుల కేసుపై 25న సుప్రీం విచారణ

By

Published : Mar 23, 2019, 7:13 AM IST

ములాయం, అఖిలేశ్​ ఆస్తుల కేసుపై 25న సుప్రీం విచారణ

ఉత్తరప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్ యాదవ్​, అఖిలేశ్ యాదవ్​​ ఆదాయాలపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు దర్యాప్తు నివేదికను న్యాయస్థానంలో సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ రాజకీయ కార్యకర్త విశ్వనాథ్ చతుర్వేది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 25న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలో విచారణ జరగనుంది.

సమాజ్​వాదీ పార్టీ నేత ములాయం సింగ్​ యాదవ్​, అతని కుమారుడు అఖిలేశ్​, కోడలు డింపుల్​, మరో కుమారుడు ప్రతీక్​లు ఆదాయానికి మించిన ఆస్తులు గడించారంటూ 2005లోనూ విశ్వనాథే వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. నివేదికను ప్రభుత్వానికి కాకుండా తమకే సమర్పించాలని సూచించింది. అయితే ఇంతవరకు సీబీఐ కేసు నమోదు చేయలేదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని ఆయన తాజాగా మరో వ్యాజ్యం దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details