తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇండియా' పేరు మార్పుపై జూన్​ 2న సుప్రీం విచారణ

ఇండియాకు బదులుగా 'భారత్​' లేదా 'హిందుస్థాన్'​ పేర్లను వాడేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ దాఖలైన పిటిషన్​పై జూన్​ 2న సుప్రీంకోర్టు విచారించనుంది.

SC to hear PIL on replacement of word 'India' with 'Bharat' on June 2
'ఇండియా' పేరు మార్పుపై జూన్​ 2న సుప్రీం విచారణ

By

Published : May 29, 2020, 6:45 PM IST

ఇండియా అనే ఆంగ్ల పదానికి బదులుగా 'భారత్‌' లేదా 'హిందుస్థాన్​' అనే పదాలను ఉపయోగించాలంటా దాఖలైన పిటిషన్​పై జూన్​ 2న వాదనలు విననుంది సర్వోన్నత న్యాయస్థానం. ఈ పిటిషన్​పై వాస్తవానికి నేడు విచారణ జరగాల్సి ఉండగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బోబ్డే అందుబాటులో లేని కారణంగా వచ్చే నెలకు వాయిదా వేసింది సుప్రీం.

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 1ను సవరించాలని, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా అనే పేరుకు బదులుగా భారత్​ లేదా హిందుస్థాన్​ అనే పదాలను వాడాలంటూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత్, హిందుస్తాన్ అనే పేర్లు భారత చరిత్రను తెలియజేసేలా ఉంటాయని పిటిషన్‌లో అతడు పేరొన్నారు. 1948లో కూడా వీటి పేర్ల ప్రస్తావన వచ్చినట్లు పిటిషన్​లో వివరించారు.

ఇదీ చూడండి:ఆపరేషన్​ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?

ABOUT THE AUTHOR

...view details