దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై న్యాయవాది అలోక్ శ్రీవాత్సవ అత్యవసర విచారణ కోరగా జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం అంగీకరించింది.
బంగాల్లో జూడాల నిరసనల నేపథ్యంలో శుక్రవారం ఈ వ్యాజ్యం దాఖలైంది. దేశంలోని అన్ని సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమించే విధంగా హోంశాఖ, ఆరోగ్యశాఖ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయాలని పిటిషనర్ కోరారు.