జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. వీటితో పాటు రాష్ట్రంలో సమాచార వ్యవస్థను స్తంభింపజేయటం, మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న అభ్యర్థనలనూ పరిశీలించనుంది.
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మహ్మద్ అక్బర్ లోన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ హస్నైన్ మసూది.. సుప్రీంలో వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీరికి తోడుగా మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్, జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి నాయకుడు షెహ్లా రషీద్ తదితరులు పిటిషన్లు వేశారు.