అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల ప్యానెల్ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా కేసును విచారించనుంది న్యాయస్థానం. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు ఓ నోటీసులో తెలిపింది.
అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కోసం మార్చి 8న మధ్యవర్తుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో ఆధ్మాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచూలను ప్యానెల్ సభ్యులుగా నియమించింది.