తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకోర్టు రిజిస్ట్రీపై పోలీసుల పర్యవేక్షణ! - cbi

సుప్రీంకోర్టు కార్యాలయంలో జరుగుతున్న ఆక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పర్యవేక్షణ కోసం సీబీఐ, దిల్లీ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ ఎస్పీలను నియమించేందుకు నిర్ణయించారు.

సుప్రీం

By

Published : Jul 8, 2019, 3:55 PM IST

సుప్రీంకోర్టు కార్యాలయంలో అక్రమాలపై నిఘా పెట్టేందుకు పోలీసు అధికారులను రంగంలోకి దించాలని నిర్ణయించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి. ఇందుకోసం సీబీఐ, దిల్లీ పోలీసు విభాగాల నుంచి సీనియర్​ ఎస్పీలను డిప్యుటేషన్​పై తీసుకురావాలని సీజేఐ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వేర్వేరు ధర్మాసనాలు విచారించాల్సిన కేసుల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సీజేఐ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానం ఉన్న కేసులు సహా ఉద్యోగులు, న్యాయవాదుల కార్యకలాపాలనూ వీరు పర్యవేక్షిస్తారు.

వరుస ఆరోపణలు

ఇటీవల ఓ పారిశ్రామికవేత్తకు సంబంధించిన కేసులో తీర్పును మార్చినట్లు వచ్చిన ఆరోపణలతో ఇద్దరు కోర్టు సిబ్బందిపై సీజేఐ వేటు వేశారు.

కేసులను ధర్మాసనాల ముందుకు తీసుకురావడంలో మధ్యవర్తుల జోక్యం ఉంటోందని న్యాయవాది ఉత్సవ్​ బైన్స్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణకు ఇప్పటికే జస్టిస్​ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించింది అత్యున్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి: 'ఆపరేషన్ సుదర్శన్​'తో సరిహద్దులు భద్రం

ABOUT THE AUTHOR

...view details