తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య' రివ్యూ పిటిషన్లపై నేడు సుప్రీం అంతర్గత విచారణ - sc to consider in chamber pleas seeking review of ayodhya case verdict

అయోధ్య కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు అంతర్గత విచారణ జరపనుంది. ఈ పిటిషన్లపై బహిరంగ విచారణ జరపాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది ఐదుగురు సభ్యుల ధర్మాసనం.

ayodhya
అయోధ్య తీర్పు రివ్యూ పిటిషన్లపై నేడు సుప్రీం అంతర్గత విచారణ

By

Published : Dec 12, 2019, 5:21 AM IST

అయోధ్య కేసులో వెలువడిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణకు చేపట్టాలా? లేదా?... అనే అంశంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం నేడు అంతర్గత విచారణ చేపట్టనుంది. బహిరంగ విచారణకు సుప్రీంకోర్టు మొగ్గుచూపితే అన్ని రివ్యూ పిటిషన్లు విచారణకు రానున్నాయి. వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయించినట్లయితే.. అన్ని రివ్యూ పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చే అవకాశం ఉంది. రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసులో నవంబర్‌ 9న సుప్రీం కోర్టు తీర్పును పునః సమీక్షించాలంటూ ఇప్పటివరకూ ఏడు పిటిషన్‌లు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు వచ్చాయి.

అయోధ్య తీర్పును సవాల్‌ చేస్తూ 40 మంది సామాజిక కార్యకర్తలు సోమవారం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్‌ దాఖలు చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది.

ఇదీ చూడండి: లోక్​సభ ముందుకు వృద్ధుల సంక్షేమ చట్ట సవరణ బిల్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details