దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించేందుకు సంరక్షణ చర్యలు చేపట్టేలా కేంద్రం, ఐఐటీలకు ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. అది ఒక పనికిమాలిన పిటిషన్ అని పేర్కొంటూ కొట్టివేసింది. పిటిషనర్, న్యాయవాది గౌరవ్ బన్సాల్కు రూ.10వేల జరిమానా విధించింది.
పిటిషన్పై వర్చువల్గా చేపట్టిన విచారణలో ఈ మేరకు అభిప్రాయపడింది జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం. కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అంశంలో అధికారులు దృష్టి సారించారని, వారికి అన్ని విషయాలు తెలుసని పేర్కొంది.
"ఇది పూర్తిగా పనికిరాని పిటిషన్. మీకు ఎంత జరిమానా విధించొచ్చో చెప్పండి. లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాల్సిన ఖర్చుగా రూ.10వేలు జరిమానా విధించి ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాం."