కరోనా రోగుల చికిత్స, మృతదేహాల అంత్యక్రియల నిర్వహణపై సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఆసుపత్రుల్లో, చెత్త కుప్పల్లో కరోనా మృతదేహాలు పడేసిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఏం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం.
దిల్లీ ఆసుపత్రుల్లో పరిస్థితి అత్యంత దయనీయం, భయానకమని విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దిల్లీలో పరీక్షల శాతం ఎందుకు తగ్గిందని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పడకలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పడకలు ఖాళీగా ఉన్నాయంటోందని వ్యాఖ్యానించింది.
నోటీసులు..