తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఏర్పాటైన కమిషన్ తదుపరి కార్యకలాపాలపై స్టే విధించింది సుప్రీం కోర్టు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
2017 సెప్టెంబర్లో కమిషన్ ఏర్పాటు..
2016 డిసెంబర్ 5న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జరిగిన చికిత్స విధానం, సంబంధిత పరిణామాలపై విచారణకు 2017 సెప్టెంబర్లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముఘస్వామి నేతృత్వంలో కమిషన్ వేసింది తమిళనాడు ప్రభుత్వం.