గుజరాత్ రాష్ట్ర మంత్రి, భాజపా నేత భుపేంద్రసింహ చుడసామాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 2017 ఎన్నికల్లో మోసపూరితంగా ఫలితాలు తారుమారు చేశారని తేల్చుతూ ఆయన ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది సర్వోన్నత న్యాయస్థానం.
జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం చుడసామా పిటిషన్‌పై విచారణ చేపట్టింది. స్టే నిర్ణయంపై వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ.. చుడసామా ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అశ్విన్ రాఠోడ్‌కు నోటీసులు జారీ చేసింది.