తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ధిక్కారంపై లాయర్​కు జైలు శిక్ష.. వెంటనే రద్దు

కోర్టు ధిక్కారానికి పాల్పడిన న్యాయవాది మాథ్యూస్​ జె నెడుంపరాకు జైలు శిక్ష విధించి వెంటనే రద్దు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఒక సంవత్సరం పాటు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేయకుండా నిషేధం విధించింది.

కోర్టు ధిక్కారంపై లాయర్​కు జైలు శిక్ష.. వెంటనే రద్దు!

By

Published : Mar 27, 2019, 5:41 PM IST

కోర్టు ధిక్కారానికి పాల్పడిన న్యాయవాది మాథ్యూస్​ జె నెడుంపరాకు మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. అనంతరం న్యాయవాది మాథ్యూస్​ క్షమాపణలు చెప్పడం వల్ల ఆ శిక్షను రద్దు చేసింది.

సీనియర్​ న్యాయవాదుల హోదాకు సంబంధించిన విషయంలో న్యాయవాది మాథ్యూస్​ అనుచితంగా ప్రవర్తించారు. ఓ సీనియర్​ న్యాయవాదిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమంగా తన కొడుకులు, కూతుళ్లకు సీనియర్ న్యాయవాదులుగా గుర్తింపునిచ్చారని మాథ్యూస్​ విమర్శించారు. ఈ ఘటనలో మాథ్యూస్​ న్యాయ నిర్ణేతలనే బెదిరించడానికి ప్రయత్నించారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదేం కొత్త కాదు

మాథ్యూస్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బొంబాయి హైకోర్ట్ న్యాయమూర్తులను బెదిరించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మరోమారు అదే పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. కోర్టు ధిక్కారం నేరం కింద 3 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

హెచ్చరిక

న్యాయవాది మాథ్యూస్​ సుప్రీం ధర్మాసనానికి బేషరతు క్షమాపణలు చెప్పడం వల్ల జస్టిస్​ ఆర్​ ఎఫ్​ నారీమన్​, జస్టిస్​ వినీత్​ శరణ్​ ఈ శిక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టుల్లోని న్యాయమూర్తులను ఇకపై ఎన్నడూ బెదిరించడానికి ప్రయత్నించొద్దని గట్టిగా హెచ్చరించారు. ఒక సంవత్సరం పాటు సుప్రీం కోర్టులో మాథ్యూస్​ న్యాయవాదిగా పనిచేయకుండా ధర్మాసనం నిషేధం విధించింది.

తాజా నోటీసులు

ప్రస్తుత ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులపై మాథ్యూస్​తో పాటు మరో ముగ్గురు న్యాయవాదులు తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయ్​, ఇతర న్యాయమూర్తులకు దీనిపై లేఖలు రాశారు. ఈ కోర్టు ధిక్కారానికి ఆగ్రహించిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా వీరిందరికీ నోటీసులు జారీచేసింది.
తమపైనే తీవ్ర ఆరోపణలు చేసిన వీరిపై మరో ధర్మాసనం ఎదుట విచారణ చేయించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయ్​ను కోరింది ప్రస్తుత ధర్మాసనం.

ఇదీ చూడండి :శారదా కుంభకోణం కేసులో అత్యంత తీవ్ర అంశాలు : సుప్రీం

ABOUT THE AUTHOR

...view details