ఈవీఎం, వీవీప్యాట్లలో లోపాలపై ఎవరైనా చేసిన ఫిర్యాదు తప్పని తేలితే జైలుశిక్ష విధిస్తామన్న ఎన్నికల సంఘం నిబంధన 49ఎమ్ఏను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
కేంద్రం, ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు - జైలు
ఈవీఎం, వీవీప్యాట్లలో లోపాలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎం లోపాలపై ఫిర్యాదు తప్పు అని తేలితే.. జైలుశిక్ష విధిస్తామన్న ఈసీ నిబంధనను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.
కేంద్రం, ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎప్పుడు ఎలా పనిచేస్తాయో తెలియని మిషన్ల పనితీరుపై ఫిర్యాదు చేస్తే జైలుపాలు చేయడమనేది రాజ్యాంగం కల్పించిన పౌరుల భావప్రకటన స్వేచ్ఛకు విఘాతమని పిటిషన్లో పేర్కొన్నారు.
సునీల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనతో ఈవీఎంలపై అనుమానాలు వచ్చినా ఫిర్యాదు చేయలేని పరిస్థితి నెలకొందంటూ ఆయన పిటిషన్లో వెల్లడించారు. ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
- ఇదీ చూడండి: మరోసారి రసవత్తరంగా కన్నడ రాజకీయం