తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీటెట్​లో 10% కోటా సంగతేంటి?- సుప్రీం - సీబీఎస్​ఈ

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం కోటాపై సీబీఎస్​ఈ స్పందన కోరింది అత్యున్నత న్యాయస్థానం. కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్​)లో ఈ విధానం అమలుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సుప్రీం

By

Published : May 16, 2019, 12:32 PM IST

Updated : May 16, 2019, 12:46 PM IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల 10 శాతం కోటాను... కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్​)లో అమలు చేయడంపై సీబీఎస్​ఈ స్పందన కోరింది సుప్రీం కోర్టు. సీటెట్​-2019 రాయబోతున్న అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించింది జస్టిస్​ ఇందిరా బెనర్జీ, జస్టిస్​ సంజీవ్​ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. జులై 1న తదుపరి విచారణ ఉంటుందని, ఆ లోపు వివరాలు సమర్పించాలని సీబీఎస్​ఈని ఆదేశించింది.

2019 జనవరిలో విడుదల చేసినసీటెట్​ నోటిఫికేషన్​ ప్రకటనలో... 10 శాతం కోటా అమలు చేయట్లేదని సీబీఎస్​ఈ తెలిపినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రుతుపవనాలు 5 రోజులు ఆలస్యం: ఐఎండీ

Last Updated : May 16, 2019, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details