తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చిదంబరానికి బెయిల్​'పై ఈడీకి సుప్రీం తాఖీదులు - supreme latest news

ఐఎన్ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీమంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్​పై అభిప్రాయం చెప్పాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ను ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

చిదంబరానికి బెయిల్​పై ఈడీ స్పందన కోరిన సుప్రీం

By

Published : Nov 20, 2019, 12:26 PM IST

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. చిదంబరం బెయిల్‌ దరఖాస్తుపై అభిప్రాయం చెప్పాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 26కు వాయిదా వేసింది.

ఈ కేసులో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు.. ఆయన జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఈ నెల 27వరకు పొడిగించింది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిదంబరం.

త్వరగా విచారణ చేపట్టండి

చిదంబరం గత 90 రోజులకు పైగా జైల్లోనే ఉన్నారని.. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం నేడు విచారణ జరిపి.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు​

ABOUT THE AUTHOR

...view details