సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్ల లెక్కింపు ప్రక్రియను 'ఓటర్ వెరిఫేయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్' (వీవీప్యాట్) ద్వారా చేపట్టే అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టతనివ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందు ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరిన ప్రతిపక్షాల పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
'వీవీప్యాట్లపై స్పష్టతనివ్వాలి' - ఈవీఎం
వీవీప్యాట్ల లెక్కింపుపై స్పష్టతనివ్వాలని ప్రధాన ఎన్నికల కమిషన్కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలలో అనుమానాలున్నాయన్న ప్రతిపక్షాల అభ్యర్థన మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.
సుప్రీం కోర్టు
ఈ విషయంపై కోర్టుకు వివరాలు తెలిపేందుకు ఈసీ ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సహా పలు ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు.