అన్ని మతాలలో విడాకులు, భరణం వంటి విషయాల్లో ఏకరూపతను తీసుకురావలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హోంశాఖ, న్యాయశాఖ, మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖలు దీనిపై సమాధానమివ్వాలని ఆదేశించింది.
విడాకుల నిబంధనలపై కేంద్రానికి నోటీసులు - Law and Justice
అన్ని మతాల్లో విడాకులు, భరణం వంటి విషయాల్లో ఒకే విధానం పాటించాలని కోరుతూ ధాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విడాకులు, భరణం విషయాల్లో కేంద్రం వివరణ కోరుతూ నోటీసులు
పెళ్లికి సంబంధించిన విషయాల్లో అన్ని మతాలలో ఒకే విధంగా వ్యవహరించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. కులం, మతం, లింగ వంటి భేదాలు లేకుండా మహిళలకు విడాకులు, భరణం విషయంలో ఏకరూపత ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలు విన్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.